జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్ కేసులో కీలక మలుపు.. ఆ నలుగురు మేజర్లే

Jubilee Hills Gang Rape Juvenile Court Treating 4 Accused As majors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్ కేసు మరో కీలక మలుపు తిరిగింది. నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువైనల్‌ కోర్టు తీర్పు వెలువరించింది. ఐతే.. ఎమ్మెల్యే కొడుకును మాత్రం జువైనల్‌గా పరిగణించాలని పేర్కొంది. మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లుగా పేర్కొంటూ కేసు నమోదు కాగా.. జువైనల్‌ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది.   

ఇదీ కేసు..
జూబ్లీహిల్స్‌ ‍అమ్నీషియా పబ్‌లో మే 28 ఓ బాలికను ట్రాప్‌ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు నిందితులు. అందులో ఒకరు మేజరు కాగా.. ఐదుగురు మైనర్లుగా పోలీసులు తేల్చారు. బాలికను రోడ్డు నెంబర్‌ 44లో ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్యాంగ్‌ రేప్‌ చేసి.. ఆ తర్వాత సాయంత్రం మళ్లీ పబ్ దగ్గర వదిలిపెట్టారు. ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. మెడపై గాయాలను చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. మే 31న పోక్సో యాక్ట్‌ ప్రకారం.. జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ప్లాన్‌ ప్రకారమే జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ ఘటన.. మైనర్లు ఉన్నందున పేర్లు కుదరదన్న సీపీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top