నేడే విజయ యాత్ర | Hyderabad Veera Hanuman Vijaya Yatra | Sakshi
Sakshi News home page

నేడే విజయ యాత్ర

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

Hyderabad Veera Hanuman Vijaya Yatra

హైదరాబాద్‌: బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరగనున్న వీర హనుమాన్‌ విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సుమారు 168 ర్యాలీలతో పాటు శోభాయాత్రలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా 3 వేల మంది పోలీసులతో పాటు సాయుధ బలగాలు, టాస్క్‌ఫోర్స్‌ బృందాలను సిద్ధం చేశారు. 

ఉదయం 8 గంటలకు గౌలిగూడ రామమందిర్‌లో యజ్ఞంతో యాత్ర ప్రారంభమై.. ఆంధ్రా బ్యాంక్‌ చౌరస్తా, ఉమెన్స్‌ కాలేజ్‌ చౌరస్తా, సుల్తాన్‌బజార్‌ చౌరస్తా నుంచి రాంకోఠి కాచిగూడ క్రాస్‌ రోడ్డు, నారాయణ గూడ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు మీదుగా అశోక్‌నగర్, గాంధీనగర్, బన్సీలాల్‌పేట్, సిటీలైట్‌ హోటల్‌ సుభాష్‌ రోడ్డు, ఉజ్జయిని మహాంకాళి టెంపుల్‌ రోడ్డు, ప్యారడైజ్‌ ఎక్స్‌రోడ్డు మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్‌ ఆలయానికి చేరుకుంటుంది.    

 

 

Advertisement
 
Advertisement
Advertisement