hanuman shoba yatra
-
నేడే విజయ యాత్ర
హైదరాబాద్: బజరంగ్దళ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరగనున్న వీర హనుమాన్ విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సుమారు 168 ర్యాలీలతో పాటు శోభాయాత్రలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా 3 వేల మంది పోలీసులతో పాటు సాయుధ బలగాలు, టాస్క్‌ఫోర్స్ బృందాలను సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు గౌలిగూడ రామమందిర్లో యజ్ఞంతో యాత్ర ప్రారంభమై.. ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా, ఉమెన్స్ కాలేజ్ చౌరస్తా, సుల్తాన్‌బజార్ చౌరస్తా నుంచి రాంకోఠి కాచిగూడ క్రాస్ రోడ్డు, నారాయణ గూడ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా అశోక్‌నగర్, గాంధీనగర్, బన్సీలాల్‌పేట్, సిటీలైట్ హోటల్ సుభాష్ రోడ్డు, ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ రోడ్డు, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్డు మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. -
హైదరాబాద్‌లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర (ఫోటోలు)
-
కర్మన్‌ఘాట్‌లో హనుమాన్ శోభాయాత్ర
హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్‌ఘాట్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి హనుమాన్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో రెండు వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. కర్మన్‌ఘాట్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్ చెరువు కట్ట, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చాదర్ఘాట్ల మీదుగా నగరంలోకి ప్రవేశించనున్నది. భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


