
సాక్షి,మెదక్: నార్సింగి ఎన్‌హెచ్44 పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నార్సింగి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం జరిగింది.
లారీ ఢీకొట్టడంతో కారులో ఉన్న సత్తిరెడ్డి కోపోద్రికుడయ్యాడు. వెంటనే లారీలో ఉన్న డ్రైవర్‌ను దిగాలని సూచించాడు. దీంతో లారీ డ్రైవర్ మృతుడిని లారీతో గుద్ది ప్రాణాలు తీశాడు. అనంతరం, లారీతో పరారయ్యాడు. హిట్ అండ్ రన్‌పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.