పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత  | Sakshi
Sakshi News home page

పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత 

Published Thu, Mar 30 2023 3:54 AM

Highest priority for police welfare  - Sakshi

రాయదుర్గం: పోలీసుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర స్పష్టం చేశారు. గచ్చిబౌలి లోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సైబరాబాద్‌ పోలీసు కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం పునరుద్ధరించిన సైబరాబాద్‌ పోలీస్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి నూతన కోఆపరేటివ్‌ సొసైటీని ప్రారంభించడం జరుగుతుందని, సొసైటీ సభ్యులంతా కలిసి సొసైటీని ముందుకు తీసుకువెళ్లడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొసైటీ సభ్యులకు మేలు చేసే కొత్త ఆలోచలనకు సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధమన్నారు. 

సైబరాబాద్‌ అన్ని రకాల ఫార్మాట్లలో ముందుగా ఉందని, ముఖ్యంగా క్రైమ్‌ డిటెన్షన్‌ సైబర్‌ క్రైమ్స్, వెల్ఫేర్‌ యాక్టివిటీస్, 17 ఫంక్షనల్‌ వరి్టకల్స్‌లో టాప్‌లో ఉందన్నారు. కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ యొక్క సర్విసులు, సొసైటీ యాప్‌ ద్వారా సభ్యులు చూసుకోవచ్చన్నారు. సొసైటీలో లావాదేవీలు అన్నీ పారదర్శకంగా జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సొసైటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో 72 ఏళ్ల చరిత్ర గల పాత సొసైటీని మూసివేస్తూ కోఆపరేటివ్‌ సొసైటీ ఆర్డర్ల ప్రకారం కొత్త సొసైటీని ప్రారంభించనున్నారు.

సొసైటీలో గతేడాది ఏప్రిల్‌ 1 నాటికి ఉన్న షేర్‌ హోల్డర్లకు 40 శాతం, 2022–23 ఏడాదికి ఉన్న షేర్‌ హోల్డర్లకు 11 శాతం డివిడెంట్‌ డిక్లేర్‌ చేయడం జరిగింది. సభ్యులు నెలవారీ పొదుపునకు ఇచ్చే వడ్డీ 7.5 శాతం నుంచి 8 శాతానికి నిర్ణయించారు. ప్రతి సభ్యుడికి రూ.10 లక్షల గాను 8.5 శాతం వడ్డీపై లోన్లు ఇవ్వడానికి సమావేశంలో నిర్ణయించారు.

కార్యక్రమంలో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి, అడ్మిన్‌ డీసీపీ యోగేష్‌ గౌతమ్, సొసైటీ సెక్రెటరీ, ఏసీపీ సురేందర్‌రావు, కోశాధికారి జి.మల్లేశం, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, డైరెక్టర్లు, ఎస్‌ఈ రాంబాబు, జూనియర్‌ అసిస్టెంట్‌ సరిత, హెడ్‌కానిస్టేబుల్‌ రాజారెడ్డి, కె.మాధవీలతా, ఇతర సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement