
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
నివేదిక తీసుకునేందుకు గురువారం ఉదయం 9 గంటలకు తమ కార్యాలయానికి రావాలని నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాను కమిషన్ కోరింది. జస్టిస్ చంద్రఘోష్ ఆయనకు సీల్డ్ కవర్‌లో నివేదికను అందించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. 115 మంది సాక్షులను విచారించిన కమిషన్ తుది నివేదికను సిద్ధం చేసింది.