కరోనా : మాజీ మంత్రి కన్నుమూత | Former Minister Mathangi Narsaiah Passed Away | Sakshi
Sakshi News home page

కరోనా : మాజీ మంత్రి కన్నుమూత

Sep 1 2020 6:59 PM | Updated on Sep 1 2020 9:27 PM

Former Minister Mathangi Narsaiah Passed Away - Sakshi

సాక్షి, పెద్దపల్లి : మాజీ మంత్రి మాతంగి నర్సయ్య(76) కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్‌ బారిపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కరోనాతో పాటు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. అతని భార్య జోజమ్మ వారం రోజుల క్రితం మృతి చెందారు. దీంతో మాతంగి నర్సయ్య కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో కొంతకాలం పాటు మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement