సాక్షి,హైదరాబాద్: ఎల్.నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. ప్రతిపక్షాలు ఈ కరువు సమస్యలను వారి రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఈ రోజు సోమవారం రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, రైతుల సదస్సు నిర్వహించారు.
రైతులకు అధికారులు వాస్తవ పరిస్థితులను వివరించాలని. ఆరు తడి పంటలు, తక్కువ సమయంలో పండే పంటలు పండించాలని మంత్రి పేర్కొన్నారు. ఆరుతడి పంటల విత్తనాలను సబ్సిడీపై అందచేస్తున్నామని రైతులు ఈ యాసంగిలో వరి పంటకు దూరంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు


