కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు | Komatireddy Venkat Reddy Attributes YS Jagan Defeat to the Election Commission | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Oct 12 2026 2:53 PM | Updated on Oct 12 2026 3:11 PM

Komatireddy Venkat Reddy Attributes YS Jagan Defeat to the Election Commission

సాక్షి,హైదరాబాద్‌ : గత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఓటమికి సంబంధించిన విషయాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజారంజక పాలన అందించారని, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, అలాగే రైతన్నలకు అండగా నిలిచారని కోమటిరెడ్డి గుర్తుచేశారు. సీఎంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకూ సంక్షేమ ఫలాలు అందినప్పటికీ, ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమి చవిచూడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘అన్ని సంక్షేమ పథకాలు అందించిన వైఎస్‌ జగన్ ఎందుకు ఓడిపోయారు? ఏపీలో అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల సంఘం పాత్రపై చర్చ
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం వ్యవహారశైలేనని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలైనప్పటికీ, ఎన్నికల సరళి, ఫలితాల మధ్య పొంతన లేకపోవడం వెనుక వ్యవస్థల ప్రభావం ఉందనే కోణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement