హైదరాబాద్‌ శివారులో రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం | Drugs Worth Of 9 Crores Seized At Bollaram | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ శివారులో రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

Mar 22 2024 6:36 PM | Updated on Mar 22 2024 7:03 PM

Drugs Worth Of 9 Crores Seized At Bollaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. ఐడీఏ బొల్లారంలో భారీగా దాదాపు 9 కోట్ల రూపాయల విలువచేసే మాదక ద్రవ్యాలను శుక్రవారం డ్రగ్ కంట్రోల్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్‌ పోల్‌ సహకారంతో బొల్లారంలో డ్రగ్స్‌ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు.

స్థానికంగా డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో అధికారులు సోదాలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించి.. రూ. 9 కోట్ల విలువైన 90 కిలోల మేపిడ్రిన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత పదేళ్లుగా ఈ డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. 

విదేశాలకు తరలిస్తున్న కస్తూరిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. సిగరెట్‌ ప్యాకెట్లలో వాటిని పెట్టి బయటకు తరలిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోనూ నిషేధిత డ్రగ్స్‌ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


చదవండి: దానం నాగేందర్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

Advertisement
 
Advertisement
Advertisement