Delivery In Another Fortnight Meanwhile The Danger - Sakshi
Sakshi News home page

గర్భిణిపై కూలిన ఇంటిపైకప్పు

Jul 28 2023 2:46 AM | Updated on Jul 28 2023 7:54 PM

Delivery in another fortnight Meanwhile the danger - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: తొలి కాన్పు కోసం పుట్టింటికి వచ్చిన గర్భిణిపై ఇల్లు కూలిన ఘటనలో కడుపులోని గర్భస్థ శిశువు మృతి చెందగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదఘటన మెదక్‌లోని మిలట్రీ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుడైన మహ్మద్‌ సర్వర్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రెండో కూతురు యాస్మిన్‌ సుల్తానా ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 15 రోజుల్లో ఆమెకు ప్రసవం చేయాల్సి ఉంది. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తరుణంలో భారీ వర్షాలకు తడిసిన ఇంటి గోడ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.

ఈ ప్రమాదంలో యాస్మిన్‌ తీవ్రంగా గాయ పడటంతో వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె కడుపులో గర్భస్థ శిశువు మృతి చెందినట్లు గుర్తించి తొలగించారు.  యాస్మిన్‌ను హైదరా బాద్‌కు రిఫర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన యాస్మిన్‌ తల్లి చాంద్‌ సుల్తానా మెదక్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. యాస్మిన్‌ సుల్తానా కుటుంబాన్ని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువా రం పరామర్శించి రూ.లక్ష సాయం అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement