'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం! | A Degree Student Committed By Suicide Writing A Letter | Sakshi
Sakshi News home page

'తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో..' ఇంకేదో కారణంతోనే అంటూ కన్నోళ్ల శోకం!

Published Tue, Oct 31 2023 9:36 AM | Last Updated on Tue, Oct 31 2023 9:39 AM

A Degree Student Committed By Suicide Writing A Letter - Sakshi

సాక్షి, మెదక్‌: అనుమానాస్పద స్థితిలో ఒక యువతి మృతి చెందిన ఘటన మెదక్‌ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శివ్వాయిపల్లి చెందిన క్కొల్ల శేఖవ్వ, మల్లేశం రెండో కుమార్తె పావని(21) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనకు బతకడం ఇష్టం లేదని లేఖలో పేర్కొనడం.. పలు అనుమానాలకు తావిస్తోంది. తమ కూతురి మృతిపై విచారణ చేపట్టాలని సోమవారం పావని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: బీటెక్‌ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement