బీటెక్‌ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థులు సరదా కోసం వెళ్లి.. ఒక్కసారిగా అనంతలోకాలకు..

Oct 31 2023 6:46 AM | Updated on Oct 31 2023 9:02 AM

- - Sakshi

ప్రమాదంలో దెబ్బతిన్న వాహనం

సాక్షి, సంగారెడ్డి: సరదాగా థార్‌ వాహనం తీసుకొని వెళ్లగా లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలో సోమవారం వేకువజాము చోటుచేసుకుంది. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. ఎస్‌ఐ అసిఫ్‌ అలీ కథనం ప్రకారం.. చందానగర్‌ వాసి షేక్‌ యాహియా అలియాస్‌ అంఫాల్‌ (20), బోడపాటి ప్రణీత్‌ (23), సామెల్‌, సంధ్యాయల సాయికార్తీక్‌ కలిసి వాహనంలో అటువైపు నుంచి కంకోల్‌కు వస్తున్నారు.

వీరు ప్రయాణిస్తున్న వెహికల్‌ మద్దికుంట శివారు ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమ సమీపంలోకి రాగానే ముందున్న లారీ ఎడమ నుంచి ఒక్కసారిగా కుడి వైపునకు దూసుకు వచ్చి ఢీకొంది. కాగా వారి వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాహియా, ప్రణీత్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా ఇద్దరికి సైతం తీవ్రగాయాలు కాగా హైదరాబాద్లో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ఇద్దరు మృతులు, సామెల్‌.. బీబీఏ, సంధ్యాయల సాయి కార్తీక్‌ బీటెక్‌ చదువుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.
ఇవి చదవండి: తాను వేసిన వలే.. కాళ్లకు చిక్కుకొని.. ఆపై మృత్యుపాశమై..

Advertisement
 
Advertisement
Advertisement