బీజేపీ ఆఫీస్‌ దగ్గరే తేల్చుకుంటాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Visits Asifabad | Sakshi
Sakshi News home page

బీజేపీ ఆఫీస్‌ దగ్గరే తేల్చుకుంటాం: సీఎం రేవంత్‌

Jun 1 2026 9:09 PM | Updated on Jun 1 2026 9:42 PM

CM Revanth Reddy Visits Asifabad

ఆసిఫాబాద్‌: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామం (కొత్తగూడ)లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా రూ. 112. 4 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌.  ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లను సైతం ప్రారంభించారు. 

ఈ మేరకు సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ‘ కాళేశ్వరం కూలేశ్వరమైంది. రూ. లక్ష కోట్లు గోదావరిలో పోసినట్లైంది. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్‌ నిర్మిస్తాం. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో చర్చలకు యత్నిస్తున్నాం. మహారాష్ట్ర సీఎంతో మీటింగ్‌కు కిషన్‌రెడ్డి చొరవ చూపాలి. తుమ్మిడిహెట్టి నిర్మిస్తే లిఫ్ట్‌లు అవసరం లేదు.

75 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొంటున్నాం. మేం కొన్న ధాన్యాన్ని, మొక్కజొన్నను కేంద్రం తీసుకోవాలి.బీజేపీ నేతలు బస్సు యాత్రలు కాదు..  కేంద్రాన్ని ధాన్యం కొనమని చెప్పండి. లేదంటే అదేంటో తేలుస్తాం. ధాన్యాన్ని కిషన్‌రెడ్డి ఇంటి ముందు పారబోస్తాం. లేకపోతే ఈ నెల 15 తర్వాత బీజేపీ ఆఫీస్‌ దగ్గరే తేల్చుకుంటాం’ అని హెచ్చరించారు. 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement