
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణిపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ధరణి లోటుపాట్లపై వారం, పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను ఆదేశించారు.
వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు నివేదికలో పొందుపరచాలన్న సీఎం.. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలకు డాటా రూపంలో వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
భూ సమగ్ర సర్వే చేయడంపై అధికారులను అడిగిన సీఎం.. భూ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధరణి సమస్యలు.. వాటి పరిష్కారంపై చర్చించారు. గ్రామ సదస్సులు, రికార్డ్స్ సవరణ ఎందుకు చేయడం లేదని సీఎం ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డికి రేవంత్‌రెడ్డి ఫోన్
కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డికి సీఎం విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: ప్రజా భవన్ ఇక డిప్యూటీ సీఎం భట్టి అధికారిక నివాసం