జస్ట్‌ రిలాక్స్‌.. ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Plays Football For Relax At Hyderabad With HCU Students, Video Goes Viral| Sakshi
Sakshi News home page

Revanth Reddy Football Playing Video: జస్ట్‌ రిలాక్స్‌.. ఫుట్‌బాల్‌ ఆడిన సీఎం రేవంత్‌

May 12 2024 12:07 PM | Updated on May 12 2024 12:29 PM

CM Revanth Reddy Plays Football for relax at Hyderabad

సాక్షి, హైదారాబాద్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిన్నటి(శనివారం)తో ముగిసింది. లోక్‌సభ ఎ‍న్నికల ప్రచారంలో బిజీబీజీగా గడిపిన నేతలు రిలాక్స్‌ అవుతున్నారు. రేపు పోలింగ్‌ జరనుండటంతో ప్రచారం మూడ్‌ నుంచి నేతలు నెమ్మదిగా బయటకు వచ్చి సేదతీరుతున్నారు. 

ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం సెంట్రల్‌ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్‌ అయ్యారు. అక్కడి విద్యార్థులుతో కాసేపు.. ఫుట్‌బాల్‌ ఆడుతూ సరదగా సేదతీరారు. ఇక రేపు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌లో తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోను​న్నారు. 

ఇక.. ఇటీవల రోహిత్‌ వేముల కేసును రీఓపెన్‌ చేయాలని అతని తల్లి సీఎం రేవంత్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆమెకు సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. మరోవైపు.. ఈ రోహిత్‌ వేముల కేసును మళ్లీ ఓపెన్‌ చేస్తామని హైదరాబాద్‌ సీసీ కొత్త శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

వీడియో క్రెడిట్స్‌: South First@TheSouthfirst

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement