కరీంనగర్‌: వెయ్యికి పైగా నాటుకోళ్ల మృతి

Bird Flu Tension In Karimnagar District Over 1000 Chickens Deceased - Sakshi

సాక్షి, హుస్నాబాద్‌: కరీంనగర్ జిల్లాలో నాటు కోళ్ల మృతి కలకలం రేపుతోంది. అంతుచిక్కని వ్యాధితో వెయ్యికి పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన రైతు తిరుపతి 1500 నాటు కోళ్ళు పెంచుతున్నారు. నిన్నటి నుంచి 24 గంటల వ్యవధిలో భారీ సంఖ్యలో కోళ్ళు మృతి చెందాయి. ఈ నేపథ్యంలో.. బర్డ్ ప్లూ కారణంగానే ఇలా జరిగిందనే భయంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా కోళ్ల మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.(చదవండి: వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం)

సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యులు మృతి చెందిన కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడడంతో రైతు తిరుపతికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. దాదాపు నాలుగు లక్షల మేర నష్టపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు. ఇక వికారాబాద్‌ జిల్లాలో సైతం వింత జబ్బుతో... వందలాది కోళ్లు చనిపోతున్న సంగతి తెలిసిందే.  కోళ్లతోపాటు కాకులు కూడా మృతి చెందుతుండటంతో బర్డ్‌ ఫ్లూ భయంతో ప్రజలు వణికిపోతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top