
30 కేజీల లగేజికి రూ.30 రుసుము
ఓ ప్రయాణికుడు మండిపాటు
బెంగళూరు: బెంగళూరు మెట్రో రైలులో 30 కేజీల బ్యాగును తీసుకెళ్లిన ప్రయాణికునికి సిబ్బంది రూ.30 రుసుము విధించారు. దీంతో అతడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఆగ్రహం వ్యక్తంచేశాడు. రూ.30 ఫీజు చెల్లించాలని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాను. బెంగళూరు నమ్మ దేశంలోనే అత్యంత ఖరీదైనది. బ్యాగ్ ఫీజులు చెల్లించాలంటే మరింత భారమవుతుంది. ప్రజలు రాకుండా మెట్రో అధికారులే అడ్డుకొంటున్నారు అనేందుకు ఇదే ఉదాహరణ అని మండిపడ్డాడు.
మెట్రో లగేజీ నియమాలు ఇలా
నమ్మ మెట్రోలో ఓ వ్యక్తి 15 కేజీల లోపు బ్యాగ్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఎక్కువ బ్యాగులు, బరువు ఉంటే ప్రతి బ్యాగ్‌కు రూ.30 చెల్లించి టికెట్ పొందాలి. ఈ లగేజ్ టికెట్‌ను వినియోగదారుల సేవా కేంద్రంలో కొనుగోలు చేయవచ్చని సిబ్బంది తెలిపారు. అదనపు బ్యాగ్‌కు టికెట్ కొనుగోలు చేయకపోతే రూ.250 జరిమానా విధించబడుతోంది. ఆ ప్రయాణికున్ని రైలు నుంచి బయటకు పంపించే అధికారం కూడా ఉంటుంది.