
సాక్షి,తెలంగాణ: డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలిలకు తెలంగాణ హైకోర్టులోనూ ఊరట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్‌ల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే ఐఏఎస్ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్ భేటీ అయ్యారు.
మరోవైపు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి ఏపీకి వెళ్లిపోతుండడంతో ఆమె స్థానంలో కొత్త కమిషనర్‌ను నియమించేందుకు సిద్ధమైంది. పలువురి అధికారుల పేర్లను పరిశీలిస్తుంది. మూసీ ప్రక్షాళన, వచ్చే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేస్తుండగా.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్‌కు భాద్యతలు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
ఏడాది కాలంలోనే ముగ్గురు జీహెచ్‌ఎంసీ కమిషనర్ల ప్రభుత్వం మార్చింది. అమ్రపాలి స్థానంలో కొత్త వారిని నియమించాలా? లేదా ఇన్‌ఛార్జ్ భాద్యతలు ఇవ్వాలా’అని తెలంగాణ సర్కారు సమాలోచనలు చేస్తోంది.