ప్రియుడి ఇంటి ముదు వివాహిత బైఠాయింపు

Adilabad: Married Woman Protest Infront Of Boy Friend House - Sakshi

ప్రేమ విషయం తెలిసి భర్త వదిలేశాడని ఆవేదన

ప్రియుడు పెళ్లి చేసుకోవాలని డిమాండ్‌

సాక్షి, ఆదిలాబాద్‌: తనను పెళ్లిచేసుకోవాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట వివాహిత బైఠాయించిన సంఘటన శనివారం మండలంలో చోటు చేసుకుంది. వివాహిత అనూష తెలిపిన వివరాల ప్రకారం.. సుర్జాపూర్‌ గ్రామానికి చెందిన జయరాజ్, అనూష కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలియడంతో జయరాజ్‌ తల్లిదండ్రులు అతడిని రాత్రికి రాత్రే ఇంటి నుంచి వేరే చోటికి పంపించారు.

ఈ సమస్యల నేపథ్యంలో అనూష తల్లి మరణించగా తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు. అనూషకు మరో వ్యక్తితో వివాహం జరిపించాడు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించారు. వారి ప్రేమ విషయం భర్తకు తెలియడంతో తనను వదిలేశాడని అనూష వాపోయింది. జయరాజ్‌ వల్లనే తన భర్త వదిలేశాడని తనను పెళ్లి చేసుకోవాలని అతడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది.  

చదవండి: భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top