తెలంగాణా హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని వంగర (పీవీ రంగారావు) బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి పాఠశాలకు వెళ్లిన బిడ్డ అనూహ్యంగా కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూలు ప్రిన్సిపాల్ , వైస్ ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నారని తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా మొరపెట్టుకుంది. తనను ఇంటికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్న కొంతసేపటికే ఆమె వసతి గృహంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాధిత బాలికను హుజురాబాద్ మండలం, రంగాపూర్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థిని వనం శ్రీవర్ష (14)నిగా గుర్తించారు.
అక్టోబర్ 23న దీపావళి సెలవుల తర్వాత శ్రీవర్ష పాఠశాలకు తిరిగి వచ్చింది. అయితే ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగా తమ కుమార్తె శ్రీవర్ష ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో వస్తువులు దొంగతనంచేసిందని ఆమెపై తప్పుడు ఆరోపణలతో వేధించారని కుటుంబం , మరికొంతమంది కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చదువుల్లో రాణిస్తూ, అత్యుత్తమ విద్యార్థినిగా ఇటీవల జిల్లా కలెక్టర్ నుండి అవార్డు కూడా అందుకుందని ఆమె సహచరులు, ఇతర మిత్రులు గుర్తు చేసుకున్నారు. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి పాఠశాల అధికారులు సిబ్బంది ఈ ఆరోపణలను ఖండించారు.
FOR SPEAKING THE TRUTH???
Varshita, a 10th class student at Government Gurukul School Vangara died by suicide recently!
Varshitha was school topper, school captain and an excellent student. She even recently received an award from the district collector.
She came back home… pic.twitter.com/WtC5XjTns2— Revathi (@revathitweets) October 26, 2025
మరోవైపు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌కు బదులుగా ట్రాక్టర్‌లో తరలిలంచడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రెండేళ్లలో గురుకులాలలో 110 విద్యార్థులు చనిపోయారని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు.


