దయచేసి దుష్ప్రచారం చేయొద్దు: ఎస్పీ చరణ్‌

SP Charan Denied Rumours Over MGM Hospital Bills - Sakshi

సాక్షి, చెన్నై: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులకు సంబంధించి చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి, బాలు ఫ్యామిలీకి మధ్య వివాదం నడిచిందనే వార్తల నేపథ్యంలో ఎస్పీ చరణ్‌ స్పందించారు. కొంత మంది కావాలని
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో నాన్నగారి ట్రీట్‌మెంట్‌కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించిందని వెల్లడించారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అనారోగ్యం బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కోవిడ్‌ నుంచి కోలుకున్నపట్పికీ ఆరోగ్యం తిరగబెట్టడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం అంతిమ సంస్కారాలు జరిగాయి. తమిళనాడు సర్కార్‌ ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించింది.
(చదవండి: పాట కోసం రథమే వేసుకొచ్చావ్‌!)

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top