మార్చి 3 నుంచి ప్లస్‌–2 పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

మార్చి 3 నుంచి ప్లస్‌–2 పరీక్షలు

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

● మార్చి 17 నుంచి పదో తరగతి పబ్లిక్‌

సాక్షి, చైన్నె : రాష్ట్రంలో ప్లస్‌టూ, పది పబ్లిక్‌ పరీక్షల టైం టేబుల్‌ సిద్ధం చేశారు. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ గురువారం ఈ షెడ్యూల్‌ను ప్రకటించారు. ప్లస్‌ 2, ప్లస్‌ 1 , 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ను, పరీక్షా ఫలితాల విడుదల తేదీలను ముందుగానే విడుదల చేశారు. బుధశారం చైన్నెలో విలేకరులతో మాట్లాడిన మంత్రి రాజ్‌మోహన్‌, ప్లస్‌ 1, ప్లస్‌ 2 పబ్లిక్‌ పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభమై మార్చి 29 వరకు కొనసాగుతాయని ప్రకటించారు. ప్లస్‌ 1, ప్లస్‌ 2 పరీక్షల ఫలితాలను మే 7న ప్రకటిస్తారు. 10వ తరగతి ప్రాక్టికల్‌ పరీక్ష ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 26 వరకు , పబ్లిక్‌ పరీక్ష మార్చి 17 నుండి ఏప్రిల్‌ 12 వరకు జరుగుతుందని వివరించారు. 10వ తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాలు మే 20న విడుదల చేస్తామన్నారు.

10వ తరగతి పరీక్షల షెడ్యూల్‌

2027 మార్చి 17న తమిళం, 25న ఆంగ్లం, 31వతేదీన గణితం, ఏప్రిల్‌ 5వ తేదీన సైన్స్‌, 9,న సోషియల్‌సైన్స్‌ 12వ తేదీన ఆప్షనల్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 వరకు పరీక్ష సమయం కేటాయించారు.ఇ ందులో 15 నిమిషాలు ప్రశ్నలుచదవడం, జవాబు పత్రం నింపేందుకు సమయం ఇచ్చారు.

ప్లస్‌టూ పరీక్షల షెడ్యూల్‌

మార్చి 3న తమిళం,8న ఆంగ్ల, 12వతేదీన కెమిసీ్త్ర, జాగ్రఫీ,అకౌంటెన్సీ, 15వ తేదీన కంప్యూటర్‌సైన్స్‌ , స్టాటిస్టిక్స్‌, 19న బయోలాజీ, బాటనీ, 23న ఫిజి క్స్‌, 29న గణితం,జువాలజీ సబ్జెక్టుల పరీక్షలు జరు గుతాయి. కాగా మంత్రి స్పందిస్తూ, విద్యార్థులను సెలవు రోజులలో ప్రత్యేక తరగతుల పేరిట వేధించ వద్దని విద్యాసంస్థలను హెచ్చరించారు. సెలవు లు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా గానీ, వారిపై మరింత ఒత్తిడి తెచ్చే విధంగాప్రత్యేక తరగతులు నిర్వహించడం సబబు కాదన్నారు. ఎవరైనా ప్రత్యేక తరగతులు నిర్వహించినట్టు సమాచారం వస్తే చర్యలు తప్పదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement