నిత్యావసరాల విక్రయాలు 100% వృద్ధి | - | Sakshi
Sakshi News home page

నిత్యావసరాల విక్రయాలు 100% వృద్ధి

Oct 15 2026 8:30 AM | Updated on Oct 15 2026 8:30 AM

సాక్షి, చైన్నె : పండుగల సీజన్‌ ప్రారంభం కావడంతో తమిళనాడులోని వినియోగదారుల కొనుగోలు విధానంలో భారీ మార్పు కనిపిస్తున్నదని అమెజాన్‌ ఎవ్రీడే ఎస్సెన్షియల్స్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ శ్రీరాం తెలిపారు. స్థానికంగా ఆయనమీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2026 సందర్భంగా సాధారణ రోజులతో పోలిస్తే నిత్యావసర వస్తువుల అమ్మకాలు ఏకంగా 100 శాతం వృద్ధిని నమోదు చేశాయని ప్రకటించారు. కిరాణా సరుకులు, స్నాక్స్‌, పెంపుడు జంతువుల ఉత్పత్తులు, పసిపిల్లల సంరక్షణ వస్తువుల వరకు నాణ్యమైన, ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో తాజా పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్‌ వంటి నిత్యావసరాలను నిమిషాల వ్యవధిలోనే అందించే అమెజాన్‌ నౌ సేవలకు అనూహ్య స్పందన లభిస్తున్నట్టు తెలిపారు. చైన్నె, కోయంబత్తూరు, వెల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు,తిరువణ్ణామలై , తిరుపత్తూరు, రాణిపేట, తదితర నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎవ్రీడే ఎస్సెన్షియల్స్‌ విభాగానికి విశేష ఆదరణ, వినియోగదారులు ఆరోగ్యం , లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన వస్తువులను అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. రాజధాని చైన్నెలో గిఫ్టింగ్‌ , నిత్యావసర సౌకర్యాలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement