రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు యూనిట్‌కు రూ. 35 చొప్పున విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు బయలుదేరాయి. డీఎంకే, అన్నాడీఎంకే , పీఎంకేలు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతోతమిళనాడు విద్యుత్‌ శా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు యూనిట్‌కు రూ. 35 చొప్పున విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలు బయలుదేరాయి. డీఎంకే, అన్నాడీఎంకే , పీఎంకేలు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతోతమిళనాడు విద్యుత్‌ శా

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే ఫైర్‌

విద్యుత్‌ శాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌ వివరణ

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో విద్యుత్‌ వాడకం రోజుకు సగటున 20 వేల మెగావాట్లకు పైగానే ఉంది. డిమాండ్‌ తగ్గ సరఫరా లేని దృష్ట్యా, బయటి మార్కెట్‌ నుంచికొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు నాలుగు వేల మెగావాట్ల కొరత ఉండటంతో ఇందుకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించి , ఒక యూనిట్‌ రూ. 35కు కొనుగోలు చేయడానికిసిద్దమయ్యారు.

వివాదం ఇదీ..

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత పేరుతో ప్రైవేట్‌ సంస్థల నుండి యూనిట్‌కు అత్యధికంగా రూ. 35 వెచ్చించి విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక భారీ మెగా స్కామ్‌ దాగి ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆయన మండిపడ్డారు. ’వెట్రి మెగా వసూల్‌ పథకం అన్నట్టుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలను శాసీ్త్రయంగా దోచుకునే పనుల్లో నిమగ్నమైందని, ఇందులో భాగంగానే ఈ అత్యధిక ధరల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పరిపాలనా వైఫల్యం, అనుభవరాహిత్యం కారణంగా రాష్ట్రంలో తరచూ విద్యుత్‌ కోతలు ఏర్పడి యావత్‌ తమిళనాడు అంధకారంలో చిక్కుకుపోయిందని, ప్రజల కష్టాలను అడ్డం పెట్టుకుని పాలకుల కమీషన్ల కోసం చూస్తున్నారని మండిపడ్డారు. అక్టోబర్‌ 12 నుండి 31 వరకు ప్రతిరోజూ 4,400 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు సగటున రూ. 35 చొప్పున 5 ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు. మార్కెట్‌లో సాధారణంగా యూనిట్‌ ధర రూ. 7 నుండి రూ. 10 లోపు ఉండగా, ఇంత భారీ మొత్తానికి కొనుగోలు చేయడం వెనుక పెద్ద కుంభకోణమే ఉందని విమర్శించారు. ఇక, మాజీ విద్యుత్‌మంత్రి, డీఎంకే సీనియర్‌నేత సెంథిల్‌ బాలాజీ స్పందిస్తూ డీఎంకే హయాంలో రూ. 20కి కొంటే తప్పు.. ఇప్పుడేమో రూ. 35కి కొనుగోలు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత కారణంగా రోజూ విద్యుత్‌ కోతల గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయని, మంత్రులు పాల్గొనే అధికారిక కార్యక్రమాలు,కాన్వొకేషన్‌ వేడుకల్లో కూడా కరెంట్‌ పోతోందని, చివరకు రాష్ట్ర నడిబొడ్డున ఉన్న సచివాలయంలోనే ఈ సమస్య తీవ్రంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు పడుతున్న కష్టాలను పట్టించుకోకుండా కేవలం సోషల్‌ మీడియా రీల్స్‌ చూపిస్తూ ప్రజలను మోసం చేయడమే ప్రస్తుత సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రూ. 35 పెట్టి విద్యుత్‌ కొంటే బోర్డు దివాలా తీయడం ఖాయం అని, విద్యుత్‌ ఛార్జీలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని ఈసందర్భంగా పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రామదాస్‌ హెచ్చరించారు.ఇప్పటికే విద్యుత్‌ బోర్డు రూ. 2.47 లక్ష కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఏడాదికి రూ. 10,000 కోట్లకు పైగా వడ్డీ చెల్లిస్తోందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో అదనపు నష్టాన్ని భరించలేక బోర్డు కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని, లేదంటే ప్రజలపై కరెంట్‌ చార్జీల బాంబు పేల్చి వాటిని రెట్టింపు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

మంత్రి వివరణ

తమ నిర్ణయం వివాదానికి దారి తీయడంతో విద్యుత్‌ మంత్రి నిర్మల్‌కుమార్‌ వివరణ ఇచ్చారు.ఈ ఒప్పందం కేవలం అక్టోబర్‌ 15 నుండి 31వ తేదీ వరకు 16 రోజులు మాత్రమే అమలులో ఉంటుంది. దీనివలన ప్రభుత్వానికి రోజుకు అదనంగా రూ. 5 కోట్లు మాత్రమే ఖర్చవుతుందన్నారు. రోజంతా 24 గంటల కోసం ఈ కొనుగోలు చేయడం లేదని, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఉండే గరిష్ట వినియోగ సమయంలో (పీక్‌ అవర్స్‌) డిమాండ్‌ను తట్టుకోవడానికే ఈ టెండర్‌ పిలిచామన్నారు. తాము 3,500 మెగావాట్ల కోసం ఆర్డర్‌ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం 1,500 మెగావాట్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నామన్నారు. గతేడాది ఇదే సమయంలో రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 16,800 మెగావాట్లుగా ఉండగా, ఎల్‌–నినో ప్రభావం వలన ఉష్ణోగ్రతలు తగ్గక ఈ ఏడాది ఏకంగా 30% పెరిగి 21,700 మెగావాట్లకు చేరిందని వివరించారు.ఇది ఎవరూ ఊహించని పరిణామం అని, కేంద్రం నుంచి తమిళనాడుకు రావలసిన వాటాలో గత నెల రోజులుగా 1,850 మెగావాట్ల విద్యుత్‌ అందలేదన్నారు. పవన విద్యుత్‌ (Wind ద్వారా 3,500 మెగావాట్లు ఆశించగా, ప్రతికూల వాతావరణం వల్ల కేవలం 500 మెగావాట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ భారీ వ్యత్యాసాన్ని భర్తీ చేయకపోతే ఇతర రాష్ట్రాల మాదిరిగా తమిళనాడులోనూ విద్యుత్‌ కోతలు విధించాల్సి వస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వం సరఫరాపై ముందస్తు స్పష్టత ఇవ్వకపోవడం వల్ల గ్యాస్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేయక తప్పలేదనన్నారు. గ్యాస్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం చాలా ఎక్కువ కాబట్టి యూనిట్‌ రూ. 35 చొప్పున లభిస్తున్నట్టు వివరించారు.

వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement