ఆయుధ పూజ, దీపావళికి 30 వేల బస్సులు | - | Sakshi
Sakshi News home page

ఆయుధ పూజ, దీపావళికి 30 వేల బస్సులు

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

సమావేశంలో మంత్రి

పార్తీబన్‌

సాక్షి, చైన్నె: ఆయుధ పూజ, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని ప్రజలు తమతమ స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు రవాణా సంస్థ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30,000కు పైగా ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రిపార్తీబన్‌ మంగళవారం ప్రకటించారు. రద్దీ నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణ , ప్రయాణ సౌకర్యాలపై సచివాలయంలో పోలీసు, ట్రాఫిక్‌ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయుధ పూజ ప్రత్యేక బస్సులు ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు చైన్నె నుంచి ప్రతిరోజూ 2,191 సాధారణ బస్సులకు అదనంగా, ఈ నాలుగు రోజుల్లో మొత్తం 6,199 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. .దీపావళి ప్రత్యేక సర్వీసులుగా నవంబర్‌ 5 – 7వ తేదీ వరకు పండుగకు ముందు మూడు రోజుల్లో సాధారణ బస్సులకు అదనంగా 9,086 ప్రత్యేక బస్సులు, మొత్తంగా నాలుగు రోజుల్లో 14,963 బస్సులను రవాణా శాఖ నడపనుంది. చైన్నె నగరంలో రద్దీని తగ్గించేందుకు పలు మార్గాలలో బస్సులను నడపున్నారు. కిలాంబాక్కం నుంచి పుదుచ్చేరి, కడలూరు, తిరుచ్చి, మదురై, తిరునెల్వేలి, కోయంబత్తూర్‌ వైపు వెళ్లే బస్సులను నడపున్నారు. మరైమలై నగర్‌, కాటన్‌ కొళత్తూర్‌ నుంచి కుంబకోణం, తంజావూరు , నాగపట్నం మార్గాల్లో వెళ్లే బస్సులు. కోయంబేడు నుంచి ఈసీఆర్‌ గుండా వెళ్లే బస్సులు, కాంచీపురం, వేలూరు, బెంగళూరు మార్గాల్లో వెళ్లే బస్సులు నడుపుతారు. మాధవరం నుంచి ఆంధ్రప్రదేశ్‌ వైపు వెళ్లే బస్సులు నడపున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement