రోజూ వ్యాయామ తరగతులు | - | Sakshi
Sakshi News home page

రోజూ వ్యాయామ తరగతులు

Oct 14 2026 1:47 AM | Updated on Oct 14 2026 1:47 AM

● మంత్రి రాజ్‌మోహన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో వారానికి 5 రోజుల పాటు (ప్రతిరోజూ) శారీరక విద్య తరగతులను తప్పనిసరిగా నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సవరించిన కొత్త టైమ్‌టేబుల్‌ను ఆయన మంగళవారం విడుదల చేశారు. అధికారులతో జరిగిన సమావేశానంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రాజ్‌మోహన్‌, విద్యార్థుల సమగ్ర వికాసానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు రోజూ శారీరక విద్య తరగతులు ఉంటాయి. ఏ ఒక్క కారణం చేత కూడా ఈ పీఈ పీరియడ్లను రద్దు చేయడానికి వీల్లేదని స్పష్‌టం చేశారు. విద్యార్థులు మైదానంలో క్రీడలు ఆడేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ , మైదాన సదుపాయాలను వెంటనే కల్పించాలని ఆదేశించారు.

6,000 ఖాళీల భర్తీపై దృష్టి: రాష్ట్రంలో 6,000కు పైగా శారీరక విద్య ఉపాధ్యాయ (పీటీ) పోస్టులు ఖాళీగా ఉండగా, ఇప్పటివరకు కేవలం 2,000 మాత్రమే భర్తీ అయ్యాయని మంత్రి తెలిపారు. ఇకపై ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదని, త్వరలోనే అన్ని ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆదేశించారు. కులం, మతం, వర్ణం, ఎత్తు, పొట్టి లేదా క్రీడా నైపుణ్యాలు వంటి ఎలాంటి వివక్ష చూపకుండా ప్రతి ఒక్క విద్యార్థికీ క్రీడల్లో సమాన అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో మార్పులు తెచ్చే ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందన్నారు.

టైమ్‌ టేబుల్‌ విడుదల చేస్తున్న మంత్రి రాజ్‌మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement