శత్రువులను ఎదుర్కొంటాం..! | - | Sakshi
Sakshi News home page

శత్రువులను ఎదుర్కొంటాం..!

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

● లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముమ్మరం

సాక్షి, చైన్నె: కమ్యూనిస్టులు కనుమరుగవ్వా లని కోరుకునే శత్రువులను తగిన రీతిలో ఎదుర్కొంటామని, కమ్యూనిజం ఎన్నటికీ నిర్వీ ర్యం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం స్పష్టం చేశారు. ఉప ఎన్నికల ఫలితాలు కమ్యూనిస్ట్‌ పార్టీలకు పడిన ఓట్ల సరళిపై సోషల్‌ మీడియాలో రకరకాల అభిప్రాయాలు, సలహాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కమ్యూనిస్టులపై ఉన్న ద్వేషం, వ్యతిరేకతతో పాటు కొందరు స్నేహపూర్వక సంక్షేమ సలహాలను కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు ఎప్పుడూ నిర్మాణాత్మక విమర్శలను, మంచి సూచనలను, సలహాలను సానుకూలంగా పరిగణలోకి తీసుకుంటాయని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిస్టులు కనుమరుగవ్వాలని కోరుకునే మన శత్రువులను తగిన రీతిలో ఎదుర్కొంటామన్నారు. కమ్యూనిజం, కమ్యూనిస్ట్‌ పార్టీ నాశనం చేయలేనివి అని, వాటిని ఎవరూ ఽనిర్వీర్యం చేయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలు, పార్టీ ప్రాభవాన్ని ఎవరూ తగ్గించలేరని, శత్రువుల కుట్రలను రాజకీయంగా ధీటుగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా ఆయన తేల్చిచెప్పారు.

మదురైపై ఉన్న తప్పుడు

అభిప్రాయాన్ని మార్చండి

– ఎస్పీ దేవనాథన్‌ విజ్ఞప్తి

సాక్షి, చైన్నె : మదురై ఒత్తకడైలో మినీ మారథాన్‌ను ప్రారంభించిన మదురై ఎస్పీ దేవనాథన్‌, మదురై అంటే హింస అనే అపోహను ప్రజలు మార్చుకోవాలని కోరారు. ప్రజలలో శారీరక ఆరోగ్యం, శారీరక దృఢత్వం , ఐక్యతను చాటిచెప్పేందుకు, మదురై జిల్లా పోలీసుల తరఫున నమ్మ మదురై... నమ్మ పోలీస్‌ అనే పేరుతో ఆదివారం మినీ మారథాన్‌ పరుగును నిర్వహించారు. పోలీస్‌ సూపరింటెండెంట్‌ దేవనాథన్‌ ఈ మినీ మారథాన్‌ పరుగును ప్రారంభించారు. ఆయన కూడా ఈ పరుగు పందెంలో పాల్గొని పరుగెత్తారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మధురై రూపురేఖలను మార్చడానికి మొదటి అడుగు వేశామన్నారు. మధురైని అక్రమాలు, హింసలతో నిండిన నగరంగా చిత్రీకరిస్తున్నారని, ఆ పరిస్థితిని మార్చి, ఇప్పటి నుంచే మధురైని ప్రక్షాళన చేయాలని,అందరం కలిసికట్టుగా పనిచేసి దీనిని సంతోషకరమైన మధురైగా మారుద్దామని పిలుపునిచ్చారు. ’మన మదురై... మన పోలీస్‌’ అనే లక్ష్యంతో, మదురైలో పరుగు, సైక్లింగ్‌ వంటి శారీరక కార్యకలాపాలు పెరిగి, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే, వారు వాటిని పోలీసులకు తెలియజేయవచ్చు అని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి పనిచేయడానికి పోలీసులు కూడా ఈ మారథాన్‌లో పాల్గొన్నారని, మధురైని సద్భావన, ఐక్యతతో నిండిన నగరంగా మార్చడానికి ప్రతిఒక్కరూ సహకరించాలి అని ఆయన పిలుపునిచ్చారు.

ఏడాదికి 3 ఉచిత

గ్యాస్‌ సిలిండర్ల పథకం

సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. 2027 పొంగల్‌ పండుగ నుంచి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఎన్నికల హామీ మేరకు అసెంబ్లీలో సీఎం విజయ్‌ ఈ పథకం గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోట్లాది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

అర్హత ప్రమాణాలు : వార్షిక ఆదాయం రూ. 2.3 లక్షలకు మించని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, దివ్యాంగుల కుటుంబాలు ఈ ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకానికి అర్హులుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,30,16,104 కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 4 వేల కోట్లను కేటాయించారు. లబ్ధిదారులు మార్కెట్‌ ధరను చెల్లించి గ్యాస్‌ సిలిండర్‌ను కొనుగోలు చేసిన తర్వాత, ఆ సిలిండర్‌ సబ్సిడి మొత్తాన్ని నేరుగా వారి ఆధార్‌–లింక్డ్‌ బ్యాంక్‌ ఖాతాలకు జమ చేస్తారు. పొంగల్‌, తమిళ నూతన సంవత్సరం , దీపావళి పండుగల సందర్భంగా ఈ మొత్తాన్ని అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ రంగ చమురు కంపెనీల డేటాతో రేషన్‌ కార్డుదారుల వివరాలను అనుసంధానిస్తున్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కనెక్షన్లు పొందినవారితో పాటు ఇతర అర్హుల వివరాలను సేకరిస్తున్నారు. రేషన్‌ కార్డుదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని ప్రత్యేక ఇ–గవర్నెన్స్‌ పోర్టల్‌ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శక పద్ధతిలో తుది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement