చైన్నెలో నవరాత్రి జెనిసిస్‌ ఎగ్జిబిషన్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో నవరాత్రి జెనిసిస్‌ ఎగ్జిబిషన్‌

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

సాక్షి,చైన్నె: చేనేత, హస్తకళలు, ఫ్యాషన్‌ డిజైనర్లును ప్రోత్సహించే విధంగా నవరాత్రి పండుగు సందర్భంగా నగరంలో జెనిసిస్‌ ఎగ్జిబీషన్‌ ఏర్పాటైంది. డిజైనర్‌ లేబుల్స్‌కు చెందిన జెనెసిస్‌ ఎగ్జిబిషన్‌ ఫ్యాషన్‌ , డిజైన్‌ , డెకర్‌ లను ఒక చోటకు చేర్చింది. పండుగలు, వివాహాల సీజన్‌కు ముందు నిర్వహించబడిన ఈ ప్రదర్శనలో భారతదేశం నలుమూలల నుండి అగ్రశ్రేణి బ్రాండ్‌లను ఒకచోట చేర్చి, డిజైనర్‌ ఫ్యాషన్‌ దుస్తులు, పెళ్లికూతురి దుస్తులు, ఆభరణాలు, విలాసవంతమైన ఉపకరణాలు, గృహాలంకరణ, జీవనశైలి సేకరణలు కొలువుదీర్చారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా రొటేరియన్‌ సి. ముత్తుస్వామి, మురళి, గౌరవ అతిథులుగా జయంతి కన్న ప్పన్‌, ఇవి.పి. రాజేశ్వరి, రొటేరియన్‌ అర్చన దేవేంద్రన్‌, రొటేరియన్‌ మల్లి శ్రీనివాస్‌, జయంతి అన్బరసులతో పాటు ఉత్సవ్‌ బజార్‌ వ్యవస్థాపకురాలు డా. ఎ. వీణా విలాషిని విచ్చేసి ప్రదర్శనను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పండుగ సీజన్‌ వస్త్రాలు, వివిధ డిజైనర్‌ల వస్త్రాలే కాదు, ప్రత్యేకమైన ఆభరణాల వరకు, యాక్సెసరీలు, డెకా ర్‌, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ వస్తువులు ఇక్కడ కొలువుదీర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement