కులశేఖరన్‌పట్నంలో దసరా ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కులశేఖరన్‌పట్నంలో దసరా ఉత్సవాలు

Oct 12 2026 2:55 AM | Updated on Oct 12 2026 2:55 AM

● భక్తిపరవశంలో తూత్తుకుడి

సాక్షి, చైన్నె: భారతదేశంలో మైసూరు తరువాత దసరా వేడుకలకు ఎంతో ప్రసిద్ధి చెందిన తూత్తుకుడి జిల్లా కులశేఖరన్‌పట్నం శ్రీ ముత్తారమ్మన్‌ ఆలయ దసరా ఉత్సవాలకు ఆదివారం ధ్వజారోహణం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున దీక్షను చేపట్టారు. ఈ పవిత్ర ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు కులసై తీరానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధల నడుమ ఉదయం 5:00 గంటలకు ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై జెండాను తీసుకువచ్చి, ధ్వజస్తంభంపై ఎగురవేశారు. అనంతరం ధ్వజస్తంభానికి వివిధ ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు.

సముద్ర స్నానాలు – కంకణ ధారణ

ఓం కాళి.. జై కాళి నినాదాలతో సముద్ర తీరం మార్మోగింది. సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయం ద్వారా అందజేసిన పసుపు దారపు కంకణం (కప్పు) ధరించి దీక్షలు ప్రారంభించారు. భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకునేందుకు కాళిమాత, శివుడు సహా పలు విభిన్న వేషధారణలు ధరించి వారం రోజుల పాటుగా ఊరూరా తిరిగి కానుకలు, భిక్ష సేకరణ చేపట్టనున్నారు. ఈనెల 20వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7:30 నుండి రాత్రి వరకు విడతల వారీగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాంస్కృతి ప్రాంగణంలో ప్రతిరోజూ వైభవంగా కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

20న సూరసంహారం

ఉత్సవాల్లో అత్యంత కీలకమైన మహిషాసూర సంహారం (సూరసంహారం) ఈనెల 20న అర్ధరాత్రి 12 గంటలకు సముద్ర తీరంలో కడచితంబేశ్వర ఆలయం ఎదుట లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరగనుంది. సింహ వాహనంపై కొలువుదీరిన ముత్తారమ్మన్‌ అమ్మవారు మహిషాసురుడిని సంహరించే ఘట్టంతో ఈ వేడుకలు చివరి దశకు చేరుకుంటాయి. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement