సౌర విద్యుత్‌ కోసం.. 20 వేల మంది దరఖాస్తు | - | Sakshi
Sakshi News home page

సౌర విద్యుత్‌ కోసం.. 20 వేల మంది దరఖాస్తు

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

● 3 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ● మంత్రి నిర్మల్‌ కుమార్‌

సాక్షి, చైన్నె : గృహ వినియోగం కోసం సౌర విద్యుత్‌ (సొలార్‌) ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సబ్సిడీని అందిస్తున్నట్లు ప్రకటించగా, ఈ పథకానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని విద్యుత్‌ శాఖ మంత్రి నిర్మల్‌ కుమార్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ప్రారంభించిన కేవలం రెండు వారాల వ్యవధిలోనే 20 వేల దరఖాస్తులు అందినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, రెండు వారాల క్రితం అసెంబ్లీలో సీఎం విజయ్‌ గృహ వినియోగ సౌర విద్యుత్‌ పథకానికి సబ్సిడీని ప్రకటించారని గుర్తు చేశారు. ఆన్‌లైన్‌ అమలు కోసం పోర్టల్‌ ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే 20 వేల దరఖాస్తులు రావడం ఈ పథకంపై ప్రజల్లో ఉన్న ఆసక్తిని తెలియచేస్తున్నట్టు వివరించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్ల పైకప్పులపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటివరకు తమిళనాడులో సుమారు లక్ష ఇళ్లకు మాత్రమే సోలార్‌ ప్యానెళ్లు అమర్చారు. తమిళనాడు వ్యాప్తంగా సోలార్‌ ప్యానెళ్లను విక్రయించే సుమారు 1,500 మంది వెండార్లతో సమావేశం నిర్వహించి, ఆన్‌లైన్‌లో సంస్థాపనను సులభతరం చేసే చర్యలపై చర్చించామన్నారు.. అర్హులైన వారికి సబ్సిడీ విడుదల చేసేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి.

బ్యాటరీ నిల్వ విధానం

అదనపు విద్యుత్‌ను బ్యాటరీలలో నిల్వ చేసుకుని, తర్వాత వినియోగించుకునే వినూత్న విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు రానున్న 10 రోజుల్లో విడుదల కానున్నాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది గరిష్ట వినియోగ సమయాల్లో 3,000 మెగావాట్ల అదనపు విద్యుత్‌ అవసరం ఉందని, నైవేలి కాంప్లెక్స్‌ నుండి రావాల్సిన విద్యుత్‌ ఆ స్థాయికి చేరకపోవడంతో అదనపు విద్యుత్‌ కొనుగోలుకు టెండర్లు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో మీటర్ల ఏర్పాటులో జరిగే ఆలస్యాన్ని నివారించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement