‘వరల్డ్‌ సైట్‌ డే’ ప్రత్యేక అవగాహన | - | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌ సైట్‌ డే’ ప్రత్యేక అవగాహన

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

సాక్షి, చైన్నె : ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ అగర్వాల్స్‌ ఐ హాస్పిటల్‌ , డాక్టర్‌ అగర్వాల్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ సంయుక్తంగా చైన్నెలో వినూత్న రీతిలో సీ వాట్‌ దే సీ పేరుతో ఇంటరాక్టివ్‌ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాయి. శుక్లాలు, గ్లాకోమా , వయసు సంబంధిత మాక్యులర్‌ డిజెనరేషన్‌, డయాబెటిక్‌ రెటినోపతి , దృష్టి లోపాలు ఉన్నప్పుడు చూపు ఎలా మారుతుందో ప్రజలకు ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చేలా ఆప్టోమెట్రీ విద్యార్థులు ప్రత్యేక సిమ్యులేషన్‌ కళ్లద్దాలను రూపొందించారు.నగరంలోని నాలుగు ప్రముఖ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్‌లో సుమారు 1,400 మందికి పైగా ప్రజలు ఈ కళ్లద్దాలను ధరించి, ఆయా కంటి సమస్యలతో దృష్టి ఎలా ప్రభావితమవుతుందో స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.డీన్‌ కర్పరగం మాట్లాడుతూ, గ్లాకోమా లాంటి నిశ్శబ్ద వ్యాధులు తీవ్రమయ్యే వరకు ఎలాంటి లక్షణాలను చూపవని, నివారించదగిన అంధత్వాన్ని అరికట్టడానికి క్రమం తప్పకుండా వార్షిక కంటి పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమనివివరించారు.ప్రతి సంవత్సరం అక్టోబర్‌ రెండవ గురువారం వరల్డ్‌ సైట్‌ డేను జరుపుకుంటారని, తాము ఒక రోజు ముందు నుంచే ఈ అవగాహన కార్యక్రమానికి శ్రీకారంచుట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement