పండుగ సీజన్‌లో ఆఫర్ల సందడి
సాక్షి,చైన్నె: పండుగ సీజన్ వచ్చేసింది, షాపింగ్ ప్రియుల కోసం అమెజాన్ బజార్ అద్భుతమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. గురువారం నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ డెకార్ , ఎలక్ట్రానిక్స్ వంటి అన్ని విభాగాలలో రూ. 300 లోపు లభించే బడ్జెట్–ఫ్రెండ్లీ ఉత్పత్తుల ప్రత్యేక శ్రేణిని అందిస్తున్నట్టు ప్రకించారు. అమెజాన్ బజార్‌లో 3 కోట్లకు పైగా ఉత్పత్తులు అందుబాటులో ఉండగా, వివిధ కేటగిరీలపై 70% వరకు తగ్గింపు, అదనపు క్యాష్‌బ్యాక్ లభిస్తుందన్నారు. అలాగే, ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు అని సూచించారు. అమెజాన్ మొబైల్ యాప్‌లో మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఈ అమెజాన్ బజార్ ద్వారా తక్కువ ధరలోనే నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు అని, అలాగే, ఎక్కువ కొనండి, ఎక్కువ ఆదా చేయండి వంటి అదనపు ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
గంజాయి తరలిస్తున్న
ఇద్దరి అరెస్టు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని ఆంధ్ర సరిహద్దులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని బస్టాండ్ వద్ద ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా మాటలు తడబడుతూ సమాధానం చెప్పారు. దీంతో పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరపగా జార్ఖాండ్ రాష్ట్రం మోడినినగర్‌కు చెందిన అక్షయకుమార్, ఒడిశా రాష్ట్రం శిలంగణికి చెందిన రుద్‌మణినాగ్‌గా తెలిపారు. వీరిద్దరూ హాటియా రైల్వేస్టేషన్ నుంచి బెంగుళూరుకు వెళ్లే రైలులో ప్రయాణం చేసి వచ్చినట్లు పోలీసులు తనిఖీలు అధికంగా ఉండటంతో జోలార్‌పేట రైల్వే స్టేషన్‌లో రైలు దిగి ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి వెళ్లినట్లు తెలియవచ్చింది. వారి వద్ద ఉన్న రూ: 2.50 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకొని వారు ఇద్దరిని అరెస్ట్ చేసి తిరుపత్తూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.
యువతికి లైంగిక వేధింపులు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా పుదూరునాడు అటవీ ప్రాంతానికి చెందిన 19 సంవత్సరాల యువతి. ఈమె తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఈమె తమ్ముడు, చెల్లిలతో కలిసి గత రెండు రోజుల క్రితం ఉంటోంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇంటిలోనికి ప్రవేశించి యువతిని లైంగికంగా వేధిచినట్లు తెలుస్తుంది. దీంతో యువతి అర్ధరాత్రి సమయంలో కేకలు వేసింది. యువతి కేకలు వేయడంతో ఆ వ్యక్తి అక్కడ నుంచి పరుగులు తీశాడు. అప్పటికే ఇంటిత సమీపంలో ఉన్న వారందరూ యువతి ఇంటికి వచ్చారు. వీటిపై యువతి తిరుపత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు పుదూరు నాడు గ్రామానికి చెందిన కన్నియప్పన్ కుమారుడు కురుంకాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. పోలీసులు అతని వద్ద విచారణ జరపగా యువతికి లైంగిక వేదింపులు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
తిరువలంగాడులో భారీవర్షం
తిరుత్తణి: తిరువలంగాడులో బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కుమ్మరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎండల తీవ్రతో తల్లడిల్లిన జనంకు వర్షం కాస్తా ఊరట కల్పించింది. వారంలో ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్న క్రమంలో కురిసిన వర్షంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.
తిరుత్తణి ఆలయ హుండీ కానుక రూ. 1.37 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో 24 రోజుల వ్యవధిలో భక్తులు హుండీల కానుకల రూపంతో రూ. 1.37 కోట్లు చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ వసంత మండపంలో మంగళవారం హుండీల కానుకలు లెక్కింపు ఆలయ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


