తిరుత్తణి: చెరుకు సాగులో అధిక దిగుబడి సాఽధించిన రైతులను తిరత్తణి సహాకార చక్కెర కర్మాగారం ద్వారా బుధవారం సత్కరించారు. తిరువలంగాడులోని తిరుత్తణి సహాకార చక్కెర కర్మాగారం 13వ వార్షికోత్సవ సమావేశం షుగర్ ఫ్యక్టరీలో బుధవారం నిర్వహించారు. ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ మీన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఫ్యాక్టరీ పరిధిలోని ఏడు డివిజన్ల నుంచి 500కు పైబడిన చెరుకు రైతులు పాల్గొన్నారు. చెరుకు సాగులో నూతన సాంకేతిక పరిజ్ణానం, కూలీల సమస్య పరిష్కారంకు యంత్రాలు, బిందునీటి సేద్యం పద్దతులు పట్ల ఫ్యాక్టరీ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. గత ఏడాది ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతుల్లో అధిక దిగుబడి సాధించిన రైతులతో పాటు, ఎక్కువ విస్తీర్ణంలో చెరుకు పంట సాగు చేసిన రైతులు, పీల్డ్ ఆఫీసర్లను సత్కరించారు.


