శాస్త్రోక్తంగా ఆళ్వార్ల మందిరా నిర్మాణానికి పూజలు
కొరుక్కుపేట: మైలాపూర్‌లోని జగదాచార్య సహస్రాబ్ది స్మారక సభ ఆధ్వర్యంలో నగర శివారులో నిర్మించనున్న మందిరం నిర్మాణం రెండవ దశ పనులకు సోమవారం శ్రీకారం చుట్టారు. జగదాచార్యులుగా ప్రసిద్ధి చెందిన రామానుజాచార్యుల తోపాటూ ఆల్వార్ల మందిరాల నిర్మాణంలో భాగంగా సోమవారం ఐదు మందిరాల నిర్మాణానికి పూజలు ప్రారంభించారు. జగదాచార్య సహస్రాబ్ది స్మారక సభ వ్యవస్థాపకులు ఊసూరు నందగోపాల్ , ఊసూరు లత పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రంగా ఆనందం శెట్టి తోపాటు దాతలు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వాస్ బృంద సభ్యులు విష్ణు సహస్రనామ పారాయణంను భక్తి శ్రద్దలతో చేశారు. అనంతరం ఆల్వార్లు మందిర నిర్మాణాలను గురించి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రామనుజాచార్యలు, 12 మంది ఆల్వార్లుకు మందిరాలను నిర్మిస్తున్నట్టు తెలిపారు తొలి దశలో మందిర నిర్మాణానికి అవసరమైన పునాది పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం రెండో దశ పనులను ప్రారంబించామని , త్వరలో ఈ ఆలయాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా వత్సల అముల్‌నాథ్, శ్రీ లక్ష్మీ , అష్రాన్, ఐ.గోపినాథ్ ,ఎథిరాజ్, సంపత్‌కుమార్, మురళీ పాల్గొన్నారు.


