పక్షవాతంపై అవగాహన కలిగి ఉండాలి
వేలూరు: పక్షవాతంపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరులోని నరువి ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రపంచ పక్షవాత దినోత్సవం పురష్కరించుకొని మారథాన్ పోటీలు ఆస్పత్రి చైర్మన్ జీవీ సంపత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. జీవీ సంపత్ మాట్లాడుతూ పక్షవాతంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొట్టమొదటిసారిగా వేలూరు పట్టణంలో 500 మందితో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం, మద్యం, పొగతాగడం వల్ల అధికంగా పక్షవాతం వచ్చే అవకాశం ఉందన్నారు. వేలూరు గాంధీ విగ్రహం వద్ద మారథాన్ పోటీలు ప్రారంభమయ్యాయి. నరువి ఆస్పత్రి ఉపాధ్యక్షులు అనిత, జనరల్ మేనేజర్ నితిన్, వేలూరు కార్పొరేషన్ జోన్ చైర్మన్‌లు, కార్పొరేటర్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.


