ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందన
శ్రీసిటీ,(సత్యవేడు) : ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ప్రయోగం విజయవంతమవడంతో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో చైర్మన్ వి.నారాయణన్, షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ , శాస్త్రవేత్తలు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైందని పేర్కొన్నారు. భారతనౌకాదళానికి, కమ్యూనికేషన్స్ పరంగా ఇది కొత్త శక్తిని అందించగలదని, తద్వారా హిందూ మహాసముద్రంలో రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమవుతుందని వెల్లడించారు.


