
40 మందికి గ్రీన్ ఇన్నోవేషన్ సర్టిఫికెట్లు
● ప్రదానం చేసిన డిప్యూటీ సీఎం
సాక్షి, చైన్నె: పర్యావరణం, వాతావరణ మార్పుల శాఖ నేతృత్వంలో 40 మందికి గ్రీన్ ఇన్నోవేషన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. పర్యావరణ సంబంధిత ఫెలోషిప్ ప్రాజెక్టును పూర్తి చేసిన వారికి ధ్రువీకరణ పత్రాలను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సోమవారం అందజేశారు. సచివాలయంలో పర్యావరణ, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులో వాతావరణ మార్పుల శాఖ నిర్వహించిన తమిళనాడు పైలట్ ప్రాజెక్ట్ సీఎం గ్రీన్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం మొదటి బ్యాచ్ ముగింపు కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రాజెక్టులను పూర్తి చేసిన 40 మంది హరిత సేవకులు, పరిశోధకులకు గ్రీన్ ఇన్నోవేషన్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అభయారణ్యం, వైల్డ్‌లైఫ్ ట్రస్ట్, దేవాంగ్ అభయారణ్యం తదితర ప్రాంతాలలో యువత తమ శక్తిని చాటే విధంగా ప్రోత్సహించేందుకు 2023లో ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 38 జిల్లాలకు 38 హరిత ప్రదేశాలు సృష్టించబడ్డాయి. ఇక్కడ ఉత్తమ సేవలతో ప్రాజెక్టును దిగ్విజయవంతం చేసిన వారిని ఎంపిక చేసి సత్కరిస్తూ వస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. గ్రీన్ తమిళనాడు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మార్పు ఉద్యమం, చిత్తడి నేల ఉద్యమం, చిత్తడి నేల పునరుద్ధరణ ఉద్యమం పనితీరును నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేక చర్యలను ఈ హరిత ఉద్యమకారులు తీసుకున్నారు. వీరి నాయకత్వ ప్రధాన పాత్రపై మొదటి బ్యాచ్‌ను జూలై నాటికి ముగించిన వారిని సత్కరించే విధంగా ముందుకెళ్లారు. ఈ ప్రాజెక్టులో 9 వేల మందికి పైగా పోటీ పడగా జిల్లాకు ఒకరు చొప్పున, రాష్ట్ర స్థాయిలో ఇద్దరిని ఎంపిక చేసి అవార్డులను అందజేశారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వీరిని సత్కరించారు. అలాగే గ్రీన్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తంగం తెన్నరసు, అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహు పాల్గొన్నారు.

40 మందికి గ్రీన్ ఇన్నోవేషన్ సర్టిఫికెట్లు