
తిరుత్తణి ఆలయంలో ఆడిపెరుక్కు సందడి
తిరుత్తణి: తిరుత్తణి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడిపెరుక్కు సందర్భంగా ఆదివారం భక్తజన సందడి నెలకొంది. ఆడిపెరుక్కుతో పాటూ ఆదివారం సెలవు దినం కావడంతో కొండకు భక్తులు పోటెత్తారు. వేకువజామున మూలవీరాట్‌కు సుగంధద్రవ్యాలతో అభిషేక పూజలు నిర్వహించి బంగారు కవచం అలంకరణలో మహాదీపారధన నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు కొండ ఆలయంకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు కావళ్లతో కొండ ఆలయం చేరుకుని మురుగనుక్కు హారోహర నామస్మరణతో ఆలయ మాడ వీధుల్లో భక్తులు సందడి చేసారు. ఉచిత క్యూలైన్‌లో మూడు గంటలు, రూ. 100 ప్రత్యేక దర్శన మార్గంలో గంటపాటు వేచివుండి భక్తులు స్వామి దర్శనం చేసి కావళ్లు చెల్లించి దర్శనం చేసారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 40 వేలకు పైగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.