తూత్తుకుడిలో కొత్త టెర్మినల్‌ | - | Sakshi
Sakshi News home page

తూత్తుకుడిలో కొత్త టెర్మినల్‌

Aug 4 2025 3:25 AM | Updated on Aug 4 2025 3:25 AM

తూత్త

తూత్తుకుడిలో కొత్త టెర్మినల్‌

– నేడు తూత్తుకుడికి సీఎం

సాక్షి, చైన్నె: తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రయాణికుల సేవల నిమిత్తం ఆదివా రం తెరిచారు. చైన్నె నుంచి తొలి విమానం ఈ టెర్మినల్‌లో ల్యాండ్‌ అయింది. తూత్తుకుడి విమానాశ్రయాన్ని ఇటీవల అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఇది వరకు చైన్నె, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు నడిచేవి. ప్రసిద్ధి చెందిన తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్య స్వామి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తుల రాక పెరిగింది. అలాగే తూత్తుకుడి, తిరుచెందూరు, కులశేఖర పట్నం పరిసరాలు, తిరునల్వేలి పరిసరాలు పారి శ్రామికంగా ప్రగతి పథంలోకి పయనిస్తున్నాయి. దీంతో తూత్తుకుడి విమానాశ్రయాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. దక్షిణ తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న విమానయాన అవసరాలను తీర్చడానికి సుమారు రూ.450 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ భవనాన్ని ప్రధానమంత్రి మోదీ గత నెల 26వ తేదీన ప్రారంభించారు. తూత్తుకుడి విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్‌ భవనం లోపల తమిళ సంస్కృతి సంప్రదాయాలు, తూత్తుకుడి హార్బర్‌, మత్స్య సంపద, తిరుచెందూరు ఆలయ శోభను చాటే రీతిలో పెయింటింగులను తీర్చిదిద్దారు. ఈ విమానాశ్రయాన్ని 17,340 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించారు. కొత టెర్మినల్‌ రద్దీ సమయాల్లో 1,350 మంది ప్రయాణికులకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ విమానాశ్రయ టెర్మినల్‌ను వారం రోజు ల తర్వాత ఉపయోగంలోకి తెచ్చారు. ఆదివారం ఉదయం చైన్నె నుంచి వచ్చిన విమానాన్ని ఈ టెర్మినల్‌లోకి అనుమతించారు. ఈ టెర్మినల్‌ నుంచి బయటకు వచ్చిన ప్రయత్ణికులకు విమానాశ్రయ వర్గాలు స్వీట్‌ బాక్సులు, పుష్పగుచ్ఛాలను అందజేసి ఆహ్వానం పలికాయి. ఇదే టెర్మినల్‌ నుంచి ప్రయాణికుల రాక పోకలకు శ్రీకారం చుట్టారు.

నేడు తూత్తుకుడికి సీఎం

తూత్తుకుడి విమానాశ్రయ కొత్త టెర్మినల్లోకి సీఎం స్టాలిన్‌ సోమవారం అడుగు పెట్టనున్నారు. తూత్తుకుడిలో రూ.16 వేల కోట్లతో తమిళనాడులో ప్రప్రథమగా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ పరిశ్రమ రూపుదిద్దుకుంది. ఇక్కడ వియత్నాంకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ ప్రారంభోత్సవంతోపాటుగా తొలి ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించేందుకు తూత్తుకుడికి సీఎం వెళ్లనున్నారు. చైన్నె నుంచి విమానంలో ఆయన వెళ్తారు. తూత్తుకుడి–మదురై బైపాస్‌లో కొత్తగా నిర్మించిన పరిశ్రమను ప్రారంభించనున్నారు.

తూత్తుకుడిలో కొత్త టెర్మినల్‌ 1
1/1

తూత్తుకుడిలో కొత్త టెర్మినల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement