
రాష్ట్ర బీజేపీకి నైనార్ కొత్త జట్టు
సాక్షి, చైన్నె: రాష్ట్ర బీజేపీకి కొత్త జట్టును అధిష్టానం బుధవారం ప్రకటించింది. అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనదైన శైలిలో ముద్ర వేస్తూ పదవులకు అర్హులైన వారికి ఎంపిక చేసుకున్నారు. ఉపాధ్యక్షురాలుగా సినీ నటి కుష్బూ సుందర్‌కు అవకాశం దక్కింది. అన్నామలైను తప్పించి నైనార్ నాగేంద్రన్‌ను అధ్యక్షుడిగా ఇటీవల బీజేపీ అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో పాత కార్యవర్గం స్థానంలో కొత్త నిర్వాహకుల ఎంపిక కసరత్తులపై నైనార్ నాగేంద్రన్ దృష్టి పెట్టారు. తొలుత డీఎంకే, ఆ తదుపరి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వచ్చిన కుష్బూ సుందర్‌కు న్యాయం చేకూర్చే విధంగా నైనార్ నిర్ణయం తీసుకున్నారు. ఆమె వాక్ చాతుర్యం, రాజకీయ ప్రతిభను గుర్తించి ఎట్టకేలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులలో ఒకరిగా ఆమెకు పదవి కేటాయించారు. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి 14 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఎం. చక్రవర్తి, కరు నాగరాజన్, శశికళ పుష్ప, వీపీ దురైస్వామి, కేపీ రామలింగం, పాల్ కనకరాజ్, డాల్ఫిన్ శ్రీధర్, కనక సభాపతి, సంపత్, జయ ప్రకాష్, వెంకటేశన్, గోపాల్ స్వామి, సుందర్ ఉన్నారు. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవ వినాయగం, వి.బాల గణపతి, ఎం మురుగానందం, కాత్యాయిణిను ఎంపిక చేశారు. కార్యదర్శులుగా కరాటే త్యాగరాజన్, వెంకటేషన్, మలర్కొడి, సుమతి వెంకటేషన్, ఎస్ మీనాక్షి, సతీస్‌కుమార్, మీనాదేవ్, వినోజ్ సెల్వం, అశ్వర్థామ, డీఆర్ ఆనంద ప్రియ, ప్రమీలా సంపత్, నాగ తలి నరసింహ పెరుమాల్, ఉదంతకుమార్, రఘురామ్ మురళి, అనుష్ ప్రసాద్‌రెడ్డిలను నియమించారు. పార్టీ కోశాధికారిగా ఎఆర్. శేఖర్, సంయుక్త కోశాధికారి ఎం శివసుబ్రమణ్యంలతో పాటూ డివిజన్ ఆర్గనైజర్లు, సోషల్ మీడియా ఆర్గనైజర్లు, స్టేట్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ కో– ఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్ర ముఖ్య వార్త సబంధిత అంశాలకు నారాయణ తిరుపతి, మీడియా ఆర్గనైజర్‌గా రంగనాయకులను నియమించారు.
అనుబంధ విభాగాలు
బీజేపీ అనుబంధ విభాగాలకు సైతం మార్పులు జరిగాయి. యువజన విభాగం రాష్ట్ర ఽ అధ్యక్షుడిగా డీజీ సూర్య,మహిళా విభాగం అధ్యక్షురాలుగా కవితా శ్రీకాంత్, క్యూ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా తిరునావుక్కరసు, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా సంభట్రాజ్, ఎస్టీ విభాగానికి అధ్యక్షుడిగా అసుమతి, వ్యవసాయ విభాగం అధ్యక్షుడిగా కె. నాగరాజ్, మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా జాన్సన్ జాకబ్‌ను నియమించారు.
శరత్, విజయధరణికి దక్కని చోటు
సినీ నటుడు శరత్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల సమయంలో తన పార్టీ సమత్తువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఆయన సతీమణి, నటి రాధిక విరుదునగర్ లోక్ సభ స్థానాకి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా విలవన్ కోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ ధరణి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలలో సీటు దక్కతుందని ఆశించి భంగపడ్డారు. ఈ ఇద్దరు గత ఏడాది కాలంగా ఎలాంటి పదవులు లేకుండా బీజేపీలో నామమాత్రంగా ఉంటూ వస్తున్నారు. తమకు పదవులు దక్కుతాయన్న ఆశతో ఉన్న ఈ ఇద్దరికి తాజాగా నిరశ తప్పలేదు. శరత్, విజయ ధరణిలకు పార్టీ పదవులలోచోటు లభించ లేదు. అయితే ఏళ్ల తరబడి సాధారణ కార్యకర్తగా రాష్ట్రంలో కొనసాగుతూ వచ్చిన కుష్బూకు పదవి దక్కడం ఆమె అభిమానులకు ఆనందమే.
● ఉపాధ్యక్షురాలుగా కుష్భు

రాష్ట్ర బీజేపీకి నైనార్ కొత్త జట్టు

రాష్ట్ర బీజేపీకి నైనార్ కొత్త జట్టు