రెడ్‌క్రాస్‌ కార్యదర్శికి అభినందన | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ కార్యదర్శికి అభినందన

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

రెడ్‌క్రాస్‌ కార్యదర్శికి అభినందన

రెడ్‌క్రాస్‌ కార్యదర్శికి అభినందన

వేలూరు: లండన్‌లోని బ్రిటీష్‌ రెడ్‌క్రాస్‌ సంఘం కార్యాలయానికి వెళ్లి, అక్కడి సంఘం సేవలపై అవగాహన పెంచుకుని, తిరిగి వచ్చిన వేలూరు జిల్లా కాట్పాడి జూనియర్‌ రెడ్‌క్రాస్‌ కార్యదర్శి జనార్దనన్‌ను సబ్‌ కలెక్టర్‌ సెంథిల్‌కుమార్‌ అభినందించారు. లండన్‌లోని రెడ్‌క్రాస్‌ సంఘం అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్‌ను కలిసి బ్రిటిష్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రానున్న 2030వ సంవత్సరంలోపు చేయనున్న పనులు, సేవా కార్యక్రమాలు, ప్రమాదంలో ఉన్న వారిని కాపాడడం, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వాటిపై అవగాహన పెంచుకోవడంతోపాటు అక్కడి ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకుని వచ్చిన జనార్దనన్‌ వేలూరులోని సబ్‌ కలెక్టర్‌ను కలిశారు. అనంతరం లండన్‌ దేశంలో చేస్తున్న సేవా కార్యకమాల గురించి తెలుసుకున్నారు. ఆయనతో పాటు వేలూరు బ్లడ్‌ బ్యాంక్‌ ఆర్గనైజర్‌ శివన్‌, రెడ్‌క్రాస్‌ సభ్యులు రమేష్‌కుమార్‌ జైన్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement