ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా: నటి సిమ్రాన్‌ | simran item song Vijay Movie | Sakshi
Sakshi News home page

ఇది నా జీవితం.. నిర్ణయం కూడా నేనే తీసుకుంటా.. విజయ్‌ సినిమాలో ఐటెం సాంగ్‌పై సిమ్రాన్‌

Apr 23 2023 6:54 AM | Updated on Apr 23 2023 7:34 AM

simran item song Vijay Movie  - Sakshi

ఒకప్పుడు తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా వెలిగిపోయిన నటి సిమ్రాన్‌. తమిళంలో కమలహాసన్‌ నుంచి అజిత్‌, విజయ్‌ అంటూ స్టార్‌ హీరోలందరితోనూ జతకట్టింది. తెలుగులోనూ అగ్ర కథానాయకిగా రాణించింది. కాగా ఆమె కథానాయకిగా మంచి ఫామ్‌ లో ఉన్నప్పుడే కొన్ని చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ లో నటించి అలరించింది. తెలుగులో చిరంజీవి కథానాయకుడు నటించిన అన్నయ్య చిత్రంలో సౌందర్య కథానాయకిగా నటించగా సిమ్రాన్‌ ఓ సాంగ్‌లో నటించింది. ఆ పాట సూపర్‌ హిట్‌ అయ్యింది.

అదేవిధంగా తమిళంలో విజయ్‌ హీరోగా నటించిన యూత్‌ చిత్రంలోనూ ఐటమ్‌ సాంగ్‌లో నర్తించింది. అప్పట్లో ఆమె ఆ పాటలో నటించడంపై పలు విమర్శలు వచ్చాయి. కాగా ఇన్నేళ్ల తర్వాత ఇటీవల తన అభిమానంతో ఇన్‌ స్ట్రాగామ్‌ లో ముచ్చటించినప్పుడు యూత్‌ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో నటించడంపై స్పందించింది. ఆమె పేర్కొంటూ ఇది తన జీవితమని, నిర్ణయం కూడా తానే తీసుకోవాలన్నారు.

అప్పట్లో విజయ్‌ హీరోగా నటించిన యూత్‌ చిత్రంలో సింగిల్‌ సాంగ్‌ నటించవద్దని చాలామంది చెప్పారు అంది. అయితే అలాంటి వారి మాటలను లెక్కచేయకుండా తాను ఆ పాటలో నటించానని వెల్లడించింది. ఆ పాట సూపర్‌ హిట్‌ అయ్యిందని పేర్కొంది. కొందరు చెప్పినట్లుగా చిత్రంలో నటించకపోతే ఓ మంచి హిట్‌ చిత్రాన్ని కోల్పోయేదాన్ని అభిప్రాయపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement