మార్కెట్లో మంచి ధర వచ్చింది.. | - | Sakshi
Sakshi News home page

మార్కెట్లో మంచి ధర వచ్చింది..

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

నేను తిరుమలగిరి మార్కెట్‌కు 50 క్వింటాళ్ల సన్నధాన్యం తీసుకొచ్చాను. క్వింటాకు రూ.3509 చొప్పన ధర వచ్చింది. కొనుగోలు కేంద్రం వద్ద అమ్ముకోవాలంటే చాలా రోజులు వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు వచ్చిన వెంటనే మంచి ధరతో కొనుగోలు చేశారు.

– ధరావత్‌ మోతీలాల్‌, రైతు, మొండ్రాయి

115 బస్తాల ధాన్యం తీసుకొచ్చాను..

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌కు ఈ రోజు 115 బస్తాల ధాన్యం తీసుకొచ్చా ను. క్వింటా ధర రూ. 3,611 పలికింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సన్న ధాన్యానికి మంచి ధర వచ్చింది. మార్కెట్‌లో కూడా వేచి చూడాల్సిన అవసరం లేకుండానే కొనుగోలు చేశారు.

– మల్లేష్‌, రామవరం, జనగామ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement