నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో ప్రభుత్వం విఫలం

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

మోతె : ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌, సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా సాగునీరు అందించి ఎండుతున్న రైతుల పంటలు కాపాడాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని రాఘవాపురం ఎక్స్‌రోడ్డు వద్ద ఎండుతున్న పంట పొలాలను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. లాల్‌తండా సబ్‌స్టేషన్‌ను సందర్శించి లాగ్‌ బుక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరందక ఎండుతున్న పంటలు చూసి రైతులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నా రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని సతీశ్‌బాబు, మద్ది మధుసూదన్‌రెడ్డి, బానోతు శంకర్‌, కాకి సురేందర్‌రెడ్డి, దేవ్లా నాయక్‌, శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement