బాలికల చదువుతోనే సమాజాభివృద్ధి : డీఈఓ | - | Sakshi
Sakshi News home page

బాలికల చదువుతోనే సమాజాభివృద్ధి : డీఈఓ

Oct 14 2026 11:04 AM | Updated on Oct 14 2026 11:04 AM

సూర్యాపేట (ఆత్మకూర్‌.ఎస్‌) : బాలికా విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని డీఈఓ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, బాల్య వివా హాలను అరికట్టందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. ఆడపిల్లలకు ఆత్మస్ధైర్యంతో పాటు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి విద్యలను నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ భాస్కర్‌, తహసీల్దార్‌ అమీన్‌సింగ్‌, మండల వైద్యాధికారి రమ్య, చైతన్య, శ్రీలక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.

రైతులు ఉద్యాన పంటలు సాగు చేయాలి

కోదాడ (నడిగూడెం) : మారుతున్న వాతావరణానికి అనుగుణంగా నీటి వసతి ఉన్న రైతులు ఉద్యానవన పంటలను సాగు చేసుకొని అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన వనశాఖ అధికారి టి.నాగయ్య అన్నారు. మంగళవారం మండలంలోని చెన్నకేశ్వాపురంలో తంగెళ్ల చంద్రయ్య వ్యవసాయ క్షేత్రంలో సిరి ఫౌండేషన్‌, కేవీకే గడ్డిపల్లి, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నిమ్మ తోటలపై సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే ఉద్యానవన విభాగం శాస్త్రవేత్త సీహెచ్‌.నరేష్‌, కేవీకే మృత్తికా విభాగం శాస్త్రవేత్త ఏ.కిరణ్‌ నిమ్మతోటలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కోదాడ ఉద్యానవనశాఖ అధికారి అనిత, మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్‌, గ్రామ సర్పంచ్‌ గోసుల రాజేష్‌, సిరి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మొలుగూరి గోపయ్య పాల్గొన్నారు.

అర్హులకే చేయూత పింఛన్లు

సూర్యాపేట (పెన్‌పహాడ్‌) : ప్రభుత్వం మంజూరు చేయనున్న చేయూత పింఛన్లకు అర్హులనే ఎంపిక చేస్తామని డీఆర్‌డీఓ సన్యాసయ్య అన్నారు. మంగళవారం పెన్‌పహాడ్‌, అనంతారం, మాచారం, అన్నారం, దూపహాడ్‌, దోసపహాడ్‌, దుబ్బగూడెం, పొట్లపహాడ్‌ గ్రామాల్లో దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 851 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 24 దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జానయ్య, ఎంపీఓ రాజేశ్వర్‌, ఏపీఎం అంజయ్య, ఏపీఓ రవి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

లక్ష్మీనరసింహుని

నిత్య కల్యాణం

మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేపట్టారు. క్షేత్రపాలకుడైన వీరాంజనేయస్వామికి నాగవల్లీ దళా లతో అర్చనలు చేశారు. అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement