సామాజిక తెలంగాణ కోసం గజ్జె కడతా | - | Sakshi
Sakshi News home page

సామాజిక తెలంగాణ కోసం గజ్జె కడతా

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

తిరుమలగిరి (తుంగతుర్తి) : సామాజిక తెలంగాణ సాధన కోసం ఆడతానని, పాడతానని, అవసరమైతే మళ్లీ గజ్జె కడతానని ప్రముఖ కవి, గాయకుడు డాక్టర్‌ ఏపూరి సోమన్న అన్నారు. ఏపూరి సోమన్న జన్మదిన వేడుకలను సోమవారం స్థానిక ఫంక్షన్‌హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాలో అంబేద్కర్‌, పూలే విగ్రహాలకు పూల మాల వేసి కళాకారుల బృందంతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అభిమానుల మధ్య కేక్‌ కట్‌ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కవులు, గాయకుల పాత్ర గొప్పదని కొనియాడారు. కవులు, గాయకులు కూడా చట్ట సభల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏపూరి ఫౌండేషన్‌ ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో తన ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. ఏపూరి ఫౌండేషన్‌ నియోజకవర్గ చైర్మన్‌గా తీగల కరుణశ్రీని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా కళాకారులు పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమంలో తుంగతుర్తి మార్కెట్‌ చైర్మన్‌ తీగల గిరిధర్‌రెడ్డి, ప్రభాకర్‌, శాగంటి రాములు, స్టాలిన్‌, అనుదీప్‌, శ్రీధర్‌, లింగం, శివ, లావణ్య, రవి, రమేష్‌, జాని, తదితరులు పాల్గొన్నారు.

కవి, గాయకుడు ఏపూరి సోమన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement