యువతను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

యువతను మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

Oct 13 2026 1:41 AM | Updated on Oct 13 2026 1:41 AM

నడిగూడెం : యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆ తరవాత హామీని అమలు చేయకుండా వారిని మోసం చేస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ విమర్శించారు. సోమవారం మండలంలోని తెల్లబల్లిలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఓటరు నమోదు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయమే లక్ష్యంగానే పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటర్ల నమోదు, పర్యవేక్షణకు ప్రతి గ్రామంలో సమన్వయకర్తలను నియమించినట్లు తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్‌ను కలిసి వారితో ఓటు నమోదు చేయించాలని ఆయన సూచించారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, ఉపాధ్యక్షుడు నలమాద నారాయణరావు, సమన్వయ కమిటీ సభ్యులు అనంతుల ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, కృష్ణమూర్తి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement