మఠంపల్లి : మట్టపల్లిలోని రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్చకులు స్వామివారి నిత్య కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అర్చనలు చేసి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. నిత్యకల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేపట్టారు. క్షేత్రంలోని శివాలయంలో పార్వతీ రామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
శివయ్యకు
ప్రత్యేక అలంకరణ
మేళ్లచెరువు: మండల కేంద్రంలోని ఇష్టకామేశ్వరి సమేత స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అర్చకులు స్వామి వారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, అన్నాభిషేకం, పుష్పార్చన చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భక్తులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం
సూర్యాపేట(భానుపురి) : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి ప్రేమ్‌రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను ఆన్ లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సోమవారం నాటి ప్రజావాణిలో మొత్తం 86 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


