చిలుకూరు : చిలుకూరు గ్రామానికి చెందిన అల్లి వీరబాబు అదే గ్రామానికి చెందిన రైతు వద్ద 9 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఇన్ని రోజులు పొలంలో ఉన్న రెండు బోర్లతో సాగునీటిని అందించాడు. అయితే వారం రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీరందక సుమారు సగం పొలం ఎండిపోయే దశకు చేరింది. చివరకు అష్టకష్టాలు పడి ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేయించినా కరెంటు కోతలతో నీరందని పరిస్థితి నెలకొంది. దాంతో జనరేటర్‌ను కిరాయికి తీసుకొచ్చి బోర్లు నడిపిస్తున్నాడు. జనరేటర్‌కు రోజుకు రూ.3500 అద్దె, డీజిల్‌కు రోజుకు రూ.2500 చొప్పున రూ.6 వేలు ఖర్చు వస్తుందని రైతు తెలిపాడు. ఇప్పటికే వేల రూపాయాలు పెట్టుబడులు పెట్టినానని, తీరా పొట్ట దశకు చేరిన పొలం కళ్ల ముందే ఎండిపోతుంటే చూడలేక జనరేటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పాడు.


